- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా థర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే యజ్ఞాలు చేయాలి : బీజేపీ మంత్రి
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో దేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పు ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సాంస్కృతికశాఖ మంత్రి ఉషా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈరోజు ఆమె ఇండోర్‌లో కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోందని […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో దేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పు ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సాంస్కృతికశాఖ మంత్రి ఉషా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.
ఈరోజు ఆమె ఇండోర్‌లో కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోందని అన్నారు. పర్యావరణ శుద్ధి కోసం నాలుగు రోజులు యజ్ఞం చేయాలన్నారు. పూర్వం మన పూర్వీకులు యజ్ఞాలు చేసి అనేక రకాలైన మహమ్మారులను వదిలించుకున్నారని చెప్పుకొచ్చారు. మనమందరం పర్యావరణాన్ని శుద్ధి చేసుకుందామని, కొవిడ్ థర్డ్ వేవ్ దేశానికి రాకుండా కాపాడుకుందామని మంత్రి సలహా ఇచ్చారు. అయితే, దీని కన్నా ముందు ఉషా ఠాకూర్
కరోనాను నిర్మూలించడానికి ఠాకూర్ ఇండోర్ విమానాశ్రయంలో ఒక విగ్రహం ముందు పూజలు చేశారు.






