- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాస్క్ గొడవ.. టీవీ నటిని హరాస్ చేస్తున్న కంగన అభిమానులు
<p>దిశ, సినిమా : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హీరోయిన్ కంగనా రనౌత్ మాస్క్ ధరించకుండా బయట తిరగడాన్ని టీవీ యాక్ట్రెస్ కిశ్వర్ మర్చెంట్ ప్రశ్నించింది. దీంతో కంగన ఫ్యాన్స్ ఆమెపై సోషల్ మీడియాలో అటాక్ చేయగా.. పర్‌ఫెక్ట్ రిప్లై ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వీడియో షేర్ చేసింది మర్చెంట్. కంగనను మాస్క్ ఎక్కడా? అని ప్రశ్నిస్తే తన అభిమానులు.. ‘కంగన నాలుగు నేషనల్ అవార్డులు గెలిచింది.. నువ్వు ముందు గెలిచిరా’ అని మెసేజ్ చేస్తున్నారని […]</p>

దిశ, సినిమా : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హీరోయిన్ కంగనా రనౌత్ మాస్క్ ధరించకుండా బయట తిరగడాన్ని టీవీ యాక్ట్రెస్ కిశ్వర్ మర్చెంట్ ప్రశ్నించింది. దీంతో కంగన ఫ్యాన్స్ ఆమెపై సోషల్ మీడియాలో అటాక్ చేయగా.. పర్‌ఫెక్ట్ రిప్లై ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వీడియో షేర్ చేసింది మర్చెంట్. కంగనను మాస్క్ ఎక్కడా? అని ప్రశ్నిస్తే తన అభిమానులు.. ‘కంగన నాలుగు నేషనల్ అవార్డులు గెలిచింది.. నువ్వు ముందు గెలిచిరా’ అని మెసేజ్ చేస్తున్నారని వ్యంగ్యంగా నవ్వేసింది. ‘ఇక్కడ మంచి నటి అవునా కాదా? అనేది పాయింట్ కాదు. తను ఫెంటాస్టిక్ యాక్టర్ అని అందరికీ తెలుసు.. కానీ తన మాస్క్ ఎక్కడ?’ అని ప్రశ్నించింది. ఆరేళ్ల కిందట పాల్గొన్న రియాలిటీ షో చూసి తన క్యారెక్టర్‌ను జడ్జ్ చేస్తున్న కంగన అభిమానులు.. ఆరు గంటల క్రితమే మాస్క్ ధరించకుండా నిబంధనలు ఉల్లంఘించిన కంగనను ఎలా జడ్జ్ చేస్తారో మీకే వదిలేస్తున్నా అంటూ కౌంటర్ ఇచ్చింది. ‘తమ అభిమాన హీరోయిన్‌ను బెదిరించడం, వేధించడం ఆపమని మెసేజ్ చేస్తున్నారు.. కానీ ఇక్కడ ఎవరు ఎవరిని హరాస్ చేస్తున్నారో అర్థమవుతుందా?’ అని ప్రశ్నించింది కిశ్వర్






