- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేడీస్ హాస్టల్‌లో పేకాటరాయుళ్లు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: జూదం ఆడేందుకు పలువురు కొత్త దారులు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఘటన విజయవాడలో వెలుగుచూసింది. పేకాట ఆడేందుకు కొంతమంది ఏకంగా ఓ లేడీస్ హాస్టల్‌ను ఎంచుకున్నారు. నిత్యం ఆ భవనంలో జూదం ఆడుతూ.. హాస్టల్‌ను కాస్త పేకాట స్థావరంగా మార్చారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు నగరంలోని సూర్యరావుపేటలో మెరుపు దాడులు చేశారు. లేడీస్ హాస్టల్‌లో భారీ ఎత్తున పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 లక్షల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జూదం ఆడేందుకు పలువురు కొత్త దారులు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఘటన విజయవాడలో వెలుగుచూసింది. పేకాట ఆడేందుకు కొంతమంది ఏకంగా ఓ లేడీస్ హాస్టల్‌ను ఎంచుకున్నారు. నిత్యం ఆ భవనంలో జూదం ఆడుతూ.. హాస్టల్‌ను కాస్త పేకాట స్థావరంగా మార్చారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు నగరంలోని సూర్యరావుపేటలో మెరుపు దాడులు చేశారు. లేడీస్ హాస్టల్‌లో భారీ ఎత్తున పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 లక్షల 50 వేల 5 వందల రూపాయాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, కరోనా, లాక్ డౌన్ కావడంతో హాస్టల్‌లో ఎవ్వరూ లేకపోవడంతో పేకాటరాయుళ్లు స్థావరంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.
Next Story






