పెంట్​ హౌజ్​ గోడకూలి ఒకరి మృతి..

by Batti.Sumithra |

<p>దిశ, అల్వాల్​: పెంట్​ హౌజ్​ గోడ కూలిపోయి ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం అల్వాల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్ ​నగర్​కు చెందిన చాడ శ్రీనివాస్ ​ఇంటి మొదటి అంతస్తు నిర్మాణం కోసం కాంట్రాక్టర్​ రవికి పనులు అప్పగించారు. సదరు కాంట్రాక్టర్​ రవి భూదేవినగర్​కు చెందిన రామస్వామి(55)తో పాటు ఐదుగురు కూలీలను తీసుకుని వచ్చి పెంట్​ హౌజ్ ​గోడను కూల్చివేయడం మొదలుపెట్టారు. సాయంత్రం గోడలను కూల్చివేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు [&hellip;]</p>

పెంట్​ హౌజ్​ గోడకూలి ఒకరి మృతి..
X

దిశ, అల్వాల్​: పెంట్​ హౌజ్​ గోడ కూలిపోయి ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం అల్వాల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్ ​నగర్​కు చెందిన చాడ శ్రీనివాస్ ​ఇంటి మొదటి అంతస్తు నిర్మాణం కోసం కాంట్రాక్టర్​ రవికి పనులు అప్పగించారు. సదరు కాంట్రాక్టర్​ రవి భూదేవినగర్​కు చెందిన రామస్వామి(55)తో పాటు ఐదుగురు కూలీలను తీసుకుని వచ్చి పెంట్​ హౌజ్ ​గోడను కూల్చివేయడం మొదలుపెట్టారు.

సాయంత్రం గోడలను కూల్చివేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గోడ రామస్వామిపై పడింది. తీవ్రగాయాలైన రామస్వామి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టుం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Next Story