- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సైరస్’.. సింగిల్ టేక్ ఆర్టిస్ట్!
<p>మహానటి సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్ నటించిన చిత్రం పెంగ్విన్. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాలో కీర్తి.. మరోసారి తన నటనకు భారీ ప్రశంసలు అందుకుంది. కానీ ఈ చిత్రంలో కీర్తితో పాటు నటించిన కుక్క గురించి ప్రేక్షకులు, విమర్శకులు ప్రత్యేకంగా మాట్లాడుతుండటం విశేషం. చిత్రానికి కీలకమైన పాత్ర సైరస్‌లో కనిపించిన ‘డాగ్’ అంత బాగా ఎలా చేయగలిగిందని? చర్చిస్తున్నారు. కాగా దీనిపై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు మూవీ డైరెక్టర్ ఈశ్వర్ […]</p>

మహానటి సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్ నటించిన చిత్రం పెంగ్విన్. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాలో కీర్తి.. మరోసారి తన నటనకు భారీ ప్రశంసలు అందుకుంది. కానీ ఈ చిత్రంలో కీర్తితో పాటు నటించిన కుక్క గురించి ప్రేక్షకులు, విమర్శకులు ప్రత్యేకంగా మాట్లాడుతుండటం విశేషం. చిత్రానికి కీలకమైన పాత్ర సైరస్‌లో కనిపించిన ‘డాగ్’ అంత బాగా ఎలా చేయగలిగిందని? చర్చిస్తున్నారు. కాగా దీనిపై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు మూవీ డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్.
నిజానికి సైరస్ పేరు మాడీ అని.. తను నా కుక్కే అని తెలిపారు ఈశ్వర్. ‘తన బాడీ లాంగ్వేజ్ నాకు పూర్తిగా తెలుసు.. అలాగే నా బాడీ లాంగ్వేజ్ తను చాలా బాగా అర్థం చేసుకుంటుంది. ముందుగా ఈ పాత్రకు తొలుత ట్రైనింగ్ కుక్కను ట్రై చేసినా.. సంతృప్తి చెందలేదు. సెట్స్‌పైకి వెళ్లే ముందు ఫైనల్‌గా మాడీని ఈ పాత్రకు ఓకే చేసినట్లు’ చెప్పాడు. అయితే తనతో నటింపజేసేందుకు అంత కష్టమేమీ కాలేదని చెప్పాడు. చాలా సహజంగా యాక్ట్ చేసిందని.. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని ప్రశంసించాడు.






