‘పెళ్లి సందడి’ని రెట్టింపు చేసే ‘పెళ్లిసందD’

by  |
‘పెళ్లి సందడి’ని రెట్టింపు చేసే ‘పెళ్లిసందD’
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ క్లాసికల్ హిట్ ‘పెళ్లి సందడి’కి 25 ఏళ్లు పూర్తయ్యాయి. రాఘవేంద్ర రావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం హీరో శ్రీకాంత్ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కాగా.. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయేంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకాభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు డైరెక్టర్. సంగీత దర్శకులు కీరవాణి, నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, జగదీష్ ప్రసాద్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ మైల్ స్టోన్‌ను రీచ్ అయిన సందర్భంగా.. పాతికేళ్ల ‘పెళ్లిసందడి’ సంబరాలను రెట్టింపు చేయడానికి ‘పెళ్లిసందD’(సీక్వెల్) సినిమాను తీసుకొస్తున్నట్లు చెప్పారు రాఘవేంద్ర రావు. శ్రీకాంత్ వారసుడు రోషన్, శ్రీ లీల హీరోహీరోయిన్లుగా తన దర్శకత్వ పర్యవేక్షలో సహాయ దర్శకురాలు గౌరీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ సాగుతోందని, త్వరలోనే థియేటర్‌లో కలుద్దామన్నారు. కీరవాణి మ్యూజికల్‌లోనే వస్తున్న సినిమాను మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.


Next Story

Most Viewed