పెగా సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్‌గా స్మృతి మాథూర్ నియామకం!

by  |
పెగా సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్‌గా స్మృతి మాథూర్ నియామకం!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కేంద్రంగా ప్రముఖ సంస్థల వ్యాపార సమస్యలకు పరిష్కారాలను అందించే పెగా సిస్టమ్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్, పీపుల్ ఆర్గనైజేషన్ హెడ్‌గా స్మృతి మాథుర్‌ను నియమిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. భారత్‌లో సంస్థ పురోగతికి, మారుతున్న టెక్నాలజీ పరిజ్ఞానాన్ని పెంచడంలో స్మృతి మాథుర్ కీలకపాత్ర పోషించనున్నారు. తద్వారా కంపెనీ వ్యూహాలను కొనసాగించేందుకు, విభిన్నమైన, సమగ్రమైన వృద్ధిని సాధించేందుకు వీలవుతుందని కంపెనీ అభిప్రాయపడింది. అలాగే, ఈ ఏడాదిలో దేశీయంగా సంస్థ నియామకాలను చేపట్టనున్నట్టు, కొత్త ఆవిష్కరణల తీసుకురావడానికి ప్రతిభావంతులను నియమించనున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రపంచంలోని ప్రముఖ సంస్థలకు డిజిటల్ ఇన్నోవేషన్‌లను రూపొందించడంలో సహాయంగా అవసరమైన వ్యూహాత్మక మార్గాలను స్మృతి మాథుర్ అందించనున్నారు. కాగా, స్మృతి మాథూర్ వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థల్లో 20 ఏళ్లకు పైగా బాధ్యతలను నిర్వహించారు. ఆర్కిటెక్ట్, ఎగ్జిక్యూటివ్, వ్యాపార వృద్ధిని పెంచడంలో గుర్తింపు పొందారని కంపెనీ పేర్కొంది. ‘పెగా సిస్టమ్స్ ఇండియా విస్తరణ కోసం కావాల్సిన వ్యూహాలను కొనసాగిస్తాను. నియామకాలను పెంచేందుకు, సంస్థ బలోపేతానికి కృషి చేయనున్నట్టు’ స్మృతి మాథూర్ చెప్పారు.


Next Story