చెబితే వినిపించుకోలే.. రూ.1000 జరిమానా పడిందిగా..!

by  |
చెబితే వినిపించుకోలే..  రూ.1000 జరిమానా పడిందిగా..!
X

దిశ, పెద్డపల్లి : దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ అలర్ట్ మోగింది. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మాస్కు లేకుండా బయట సంచరిస్తూ కనిపిస్తే రూ.1000 జరిమానా విధించాలని గురువారం తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెద్దపల్లి పట్టణ పోలీసులు మాస్కులు లేకుండా తిరిగే వాళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. శుక్రవారం ఉదయం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వాహనాల నెంబర్ ప్లేట్స్, డాక్యుమెంట్స్ పరిశీలించి కాలం చెల్లిన వాహనాలకు ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు జరిమానా విధించారు.

ఆ తర్వాత ట్రాఫిక్ సీఐ అనిల్ పట్టణంలోని కమాన్ చౌరస్తా వద్ద మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని పట్టుకుని రూ. వెయ్యి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని లేకపోతే కరోనా కొత్త వేరియంట్ బారిన పడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇకపై పట్టణంలో తరచుగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. కరోనా నియంత్రణ వ్యాక్సినేషన్‌తోనే సాధ్యమని కావున, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ రెండు డోసులు తీసుకోవాలన్నారు. భౌతిక దూరం పాటించడమే కాకుండా మాస్కులు కూడా ధరించాలన్నారు. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తుందని వివరించారు.



Next Story

Most Viewed