- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్.. లంచం తీసుకున్న పెద్దపల్లి RDOకు దిమ్మతిరిగే షాక్
<p>దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి ఆర్డీవో, రామగుండం కార్పొరేషన్ ఇన్‌చార్జీ కమిషనర్ శంకర్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. రామగుండం కమిషనర్‌గా ఇన్‌చార్జీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శంకర్ కుమార్.. కాంట్రాక్టర్ రజనీకాంత్‌కు సంబంధించిన బిల్లు విషయంలో రూ. లక్ష లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి.. శంకర్ కుమార్ మామూళ్లు డిమాండ్ చేస్తున్నారని చెప్పుకున్నారు. పథకం ప్రకారం.. ఏసీబీ అధికారులు కాంట్రాక్టర్ రజినీకాంత్ రూ. లక్ష లంచాన్ని.. ఆర్డీవో శంకర్ వద్ద పనిచేసిన […]</p>

దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి ఆర్డీవో, రామగుండం కార్పొరేషన్ ఇన్‌చార్జీ కమిషనర్ శంకర్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. రామగుండం కమిషనర్‌గా ఇన్‌చార్జీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శంకర్ కుమార్.. కాంట్రాక్టర్ రజనీకాంత్‌కు సంబంధించిన బిల్లు విషయంలో రూ. లక్ష లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి.. శంకర్ కుమార్ మామూళ్లు డిమాండ్ చేస్తున్నారని చెప్పుకున్నారు. పథకం ప్రకారం.. ఏసీబీ అధికారులు కాంట్రాక్టర్ రజినీకాంత్ రూ. లక్ష లంచాన్ని.. ఆర్డీవో శంకర్ వద్ద పనిచేసిన మల్లిఖార్జున్‌కు ఇస్తుండగా పట్టుకున్నారు. ఈ క్రమంలో శంకర్ కుమార్ అక్రమాలపై ఆరా తీశారు. అనంతరం శంకర్ కుమార్‌ను ఏసీబీ కోర్టులో హాజరు పర్చగా జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. 48 గంటలకు పైగా జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో కరీంనగర్ ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

- Tags
- crime
- Karimnagar






