ప్రభుత్వంలో చలనం లేదు….

by  |
ప్రభుత్వంలో చలనం లేదు….
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్:
నిజాం సాగర్ బ్యాక్ వాటర్‌లో పంటలు మునిగి రైతులు నష్టపోయే పరిస్థితి ఉన్న ప్రభుత్వానికి చలనం లేదని పీసీసీ నాయకుడు బాన్సువాడ సుభాశ్ రెడ్డి అన్నారు. నిజాం సాగర్ నిండి బ్యాక్ వాటర్‌తో పాగిరెడ్డి పేట్ మండలంలో పంటలు మునిగిపోయాయని స్థానిక రైతులు మండి పడ్డారు. గేట్లను ఎత్తి పంటలను కాపాడాలనీ, అందుకు చొరవ తీసుకోవడం లేదంటూ స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ దిష్టి బొమ్మను రైతులు దగ్దం చేశారు. నాగారెడ్డి పేట రహదారిపై అంతకు ముందు రైతులు ధర్నాను నిర్వహించారు. రైతుల ఆందోళనకు పీసీసీ నాయకుడు బాన్సువాడ సుభాష్ రెడ్డి మద్ధత్తు తెలిపారు. ఈ సందర్బంగా సుభాశ్ రెడ్డి మాట్లాడుతూ… టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో మక్కల కొనుగోళ్లకు, మద్ధతు ధరల కోసమే కాకుండా పంటలను కాపాడుకోవడానికి రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు చిత్త శుద్ధి లేదనీ, రైతులంటే ప్రేమ లేదని అన్నారు. రైతుల గురించి పట్టించుకోకపోతే అందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.



Next Story