- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజల కడుపుమంటలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుంది
<p>దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ ఆరోపించారు. చిత్తూరులో సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన విద్యుత్ చార్జీల నిరసనలో శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలను ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోందన్నారు. ప్రజల కడుపుమంటలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని శైలజానాథ్ శాపనార్థాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చుకోవడానికి.. లగ్జరీలను అనుభవించేందుకు ప్రజలను బలి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను […]</p>

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ ఆరోపించారు. చిత్తూరులో సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన విద్యుత్ చార్జీల నిరసనలో శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలను ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోందన్నారు. ప్రజల కడుపుమంటలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని శైలజానాథ్ శాపనార్థాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చుకోవడానికి.. లగ్జరీలను అనుభవించేందుకు ప్రజలను బలి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రజలను ఎన్ని రకాలుగా దోపిడీ చేయాలో అన్ని రకాలుగా దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని శైలజానాథ్ విమర్శించారు. చివరకు ఒంటిపైన వేసుకునే బట్టలు, జుట్టు కత్తిరించడానికి కూడా పన్ను వేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. వ్యవసాయ మోటార్ పంప్ సెట్‌లకు మీటర్లు బిగించడంలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటించి అడ్డుకుంటామని శైలజానాథ్ తేల్చి చెప్పారు. ఇకనైనా దోపిడీని ఆపకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తోందని పీసీసీ చీఫ్ శైలజానాథ్ హెచ్చరించారు.






