- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్: స్టార్ డైరెక్టర్ లైంగిక వేధింపులు.. నటి పాయల్ పై యాసిడ్ దాడి
<p>దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో దారుణం చోటుచేసుకొంది. బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ పై కొందరు గుర్తుతెలియని దుండగులు యాసిడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ లో తెలుపుతూ ఒక వీడియోను విడుదల చేసింది. “ముంబైలో ఓ షాపుకు వెళ్లి మందులు కొనుగోలు చేసి వస్తున్నా సమయంలో నాపై దాడి జరిగింది. కారులో కూర్చుంటున్న సమయంలో ఓ రాడ్డుతో కొందరు నన్ను విచక్షణ రహితంగా […]</p>

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో దారుణం చోటుచేసుకొంది. బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ పై కొందరు గుర్తుతెలియని దుండగులు యాసిడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ లో తెలుపుతూ ఒక వీడియోను విడుదల చేసింది. “ముంబైలో ఓ షాపుకు వెళ్లి మందులు కొనుగోలు చేసి వస్తున్నా సమయంలో నాపై దాడి జరిగింది. కారులో కూర్చుంటున్న సమయంలో ఓ రాడ్డుతో కొందరు నన్ను విచక్షణ రహితంగా కొట్టారు. అప్పుడే నేను వారి చేతిలో ఓ బాటిల్ ని చూశాను. బహుశా అదే యాసిడ్ అయ్యి ఉంటుంది అనుకొంటున్నాను. వారు దాన్ని నా మీద పోయడానికి ప్రయత్నించగా నేను తప్పించుకొన్నాను. ఆ సమయంలోనే నా ఎడమచేతికి స్వల్పంగా గాయమైనట్లు తెలుపుతూ.. కట్టుతో ఉన్న చేతిని చూపించింది. అయితే ఈ దాడికి కారణం దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపులు చేయడమే అని అనుమానులు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.






