Pawan Kalyan with his son Akira Nandan. వారసుడితో పవన్ కళ్యాణ్..

by  |
Pawan Kalyan with his son Akira Nandan. వారసుడితో పవన్ కళ్యాణ్..
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, (Pawan Kalyan) రేణు దేశాయ్ (Renu Desai)ల తనయుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలే రేణు తన కొడుకు టాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదని చెప్పడంతో కొంతవరకు సైలెంట్ అయ్యారు. ఇక అకీరా తన తండ్రి పవన్ తో చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాడు. కానీ, కనిపించిన ప్రతిసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంటాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తో కలిసి అకీరా (Akira Nandan) దిగిన ఒక ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ పక్కన ఎంతో ఒద్దికగా నిల్చున్న జూనియర్ పవన్ కళ్యాణ్ చాలా ముద్దొస్తున్నాడు. తండ్రిలానే చేయి వెనక్కిపెట్టి కనిపిస్తున్న అకీరా అచ్చు పవన్ నే అనుకరిస్తునట్లు కనిపిస్తుంది.

ఇక ఈ ఫోటో చూసినవారందరు అకీరా హైట్ గురించే మాట్లాడుకొంటున్నారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రస్తుతం అకీరా హైట్ 6 అడుగుల 4 అంగుళాలు. ఈ ఫొటోలో తండ్రి కన్న రెండు అంగుళాలు హైట్ గానే కనిపిస్తున్నాడు. దీంతో పవర్ స్టార్ కన్నా ఎక్కువ ఎదిగిపోయాడు అని కొందరు.. తండ్రిని మించిన తనయుడు అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం పవన్ ఇటీవలే కరోనా నుండి కోలుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. లాక్ డౌన్ అనంతరం పవన్ మళ్లీ షూటింగ్ లో పాల్గొననున్నారు.

Viral Click: Pawan Kalyan with his son Akira Nandan

Next Story

Most Viewed