ఆయనకు తమ్ముడిగా పుట్టడం నా అద‌ృష్టం : పవన్ కల్యాణ్

by  |
ఆయనకు తమ్ముడిగా పుట్టడం నా అద‌ృష్టం : పవన్ కల్యాణ్
X

దిశ, ఏపీ బ్యూరో : మెగాస్టార్ చిరంజీవికి సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి త‌న‌కే కాకుండా ఎందరికో మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత, ఎందరికో ఆదర్శప్రాయుడని కొనియాడుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. చిరంజీవికి తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టమన్నారు.

అన్నయ్యను అభిమానించే ఆరాధించే లక్షలాదిమందిలో తాను తొలి అభిమానినని చెప్పుకొచ్చారు. చిరంజీవి తన జీవితంలో సినీరంగంతోపాటు.. రాజకీయాల్లోనూ ఉన్నత పదవులు అధిరోహించారని అయితే ఏనాడు తల ఎగరేయలేదని చెప్పుకొచ్చారు. విజయాలు ఎన్ని సాధించినా.. రికార్డులు ఎన్ని సృష్టించినా అదే విధేయత, అదే వినమ్రత చిరంజీవి సొంతమన్నారు. అందువల్లనేమో ఆయనను సొంత మనిషిలా లక్షలాది మంది భావిస్తారని అన్నారు.

కరోనా కాలంలో సినీ కార్మికుల ఆకలి తీర్చేందుకు అన్నయ్య ఎంతో కష్టపడ్డారని తెలిపారు. అంతేకాదు తమకు అన్నగా పుట్టిన చిరంజీవి తమను తండ్రిలా సాకారని.. తండ్రి స్థానంలో నిలిచినట్లు కొనియాడారు. అన్నయ్య చిరంజీవికి ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు ప్రసాదించాలని.. చిరాయువుతో చిరంజీవిగా భాసిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.

Next Story