వెంకటేశ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు : పవన్

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలుగు స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ నేడు 60వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షులు తెలియజేశారు. ‘‘మంచి మనసున్న సన్మిత్రులు, ప్రముఖ కథానాయకులు వెంకటేశ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటేశ్ గారితో నాకున్నస్నేహం ఎంతో ప్రత్యేకమైనది. నేను కథానాయకున్ని కాకముదు నుంచి ఆయనతో [&hellip;]</p>

వెంకటేశ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు : పవన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ నేడు 60వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షులు తెలియజేశారు. ‘‘మంచి మనసున్న సన్మిత్రులు, ప్రముఖ కథానాయకులు వెంకటేశ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటేశ్ గారితో నాకున్నస్నేహం ఎంతో ప్రత్యేకమైనది. నేను కథానాయకున్ని కాకముదు నుంచి ఆయనతో నాకు మంతి మితృత్వం ఉంది. ఆయనలో ఏదైనా కొత్తది నేర్చుకోవాలనే తపన ఉంటుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక, ధార్మిక, లౌకిక సంబంధాలు మా స్నేహాన్ని ధృడపరిచాయి. ఆ స్నేహమే మేమిద్దరం ‘‘గోపాల గోపాల’’ చిత్రంలో నటించేలా చేసింది. మా ఆలోచనలకు ఆ చిత్ర అద్దంపట్టింది. కొత్త తరం దర్శకుల కథలకు.. ఆలోచనలకు అనుగుణంగా తనను తాను మలచుకొని వెంకటేశ్ గారు మరిన్ని విజయాలతో ప్రేక్షకులను మెప్పిస్తారని ఆకాంక్షిస్తున్నాను.’’ అని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Next Story