భవిష్యత్‌లో గొప్పగా విరాజిల్లుతుంది : పవన్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధితనే పవన్ కళ్యాణ్ శనివారం కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం గుడివాడ నియోజకవర్గం డోకిపర్రు గ్రామంలోని వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్‌కు మెగా కృష్ణారెడ్డి దంపతులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. మెగా కృష్ణారెడ్డి, పిచ్చిరెడ్డి డోకిపర్రు గ్రామానికి ఎన్నో సేవలు చేస్తున్నారని, భవిష్యత్‌లో మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూశానని, చివరకు [&hellip;]</p>

భవిష్యత్‌లో గొప్పగా విరాజిల్లుతుంది : పవన్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధితనే పవన్ కళ్యాణ్ శనివారం కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం గుడివాడ నియోజకవర్గం డోకిపర్రు గ్రామంలోని వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్‌కు మెగా కృష్ణారెడ్డి దంపతులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. మెగా కృష్ణారెడ్డి, పిచ్చిరెడ్డి డోకిపర్రు గ్రామానికి ఎన్నో సేవలు చేస్తున్నారని, భవిష్యత్‌లో మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూశానని, చివరకు ఇవాళ కుదిరిందని తెలిపారు. అంతేగాకుండా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం భవిష్యత్‌లో మరింత గొప్పగా విరాజిల్లుతుందని అన్నారు. పవన్ డోకిపర్రు గ్రామ పర్యటన ముందే తెలిసిన జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని, జనసేనికి స్వాగతం పలికారు. పవన్ పర్యటనలో నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

Next Story