కర్రసాముతో అదరగొట్టిన పవన్ వారసుడు.. వీడియో వైరల్

by  |
కర్రసాముతో అదరగొట్టిన పవన్ వారసుడు.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా గురించి తెలియని వారుండరు. ఇక ఎప్పటినుంచో అకీరా తెరంగేట్రం గురించి చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల అకీరా తల్లి రేణు దేశాయ్.. ఇప్పట్లో అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఉండదని క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్స్ కి చెక్ పడింది. అకీరా నందన్ ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ఒక వీడియోను రేణు సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో మళ్లీ అకీరా సినీ ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ సినిమాలలోకి వచ్చేముందే మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన విద్యను అభ్యసించారు. ఆ తరువాత పలు సినిమాలలో ఆయన ఆ విద్యను ప్రదర్శించారు.

ఇక తాజాగా తనయుడు అకీరా కూడా మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన విద్యను నేర్చుకోవడం ఆసక్తిని కలిగిస్తుంది. వీడియోలో అలవోకగా కర్రను తిప్పుతూ.. కర్రసాము చేస్తూ కనిపిస్తున్న అకీరాను చూస్తుంటే తండ్రి పవన్ ని చూసినట్లే ఉంది అనడంలో అతిశయోక్తి లేదంటున్నారు పవన్ అభిమానులు. ఎంతైనా తండ్రికి తగ్గ తనయుడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఇదంతా అకీరా సినీ ఎంట్రీ కోసమేనా..? లేక జనరల్ గా నేర్చుకుంటున్నాడా..? అనేది తెలియాల్సి ఉంది. ఎవరు ఎన్ని అనుకున్నా హీరోగా మారాలి అనే విషయంలో అకీరాదే తుది నిర్ణయం. మరి అకీరా హీరోగా రావాలని అనుకుంటున్నాడా..? లేదా..? అనేది చూడాలి.

Next Story