పవన్ కోసం జానీ మాస్టర్ కథ

by  |
పవన్ కోసం జానీ మాస్టర్ కథ
X

దిశ, వెబ్‌డెస్క్ : వకీల్ సాబ్‌గా టాలీవుడ్ కమ్ బ్యాక్ ఇస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్, క్లాసిక్ డైరెక్టర్ క్రిష్‌తో పాటు సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ సినిమాలను అఫిషియల్‌గా అనౌన్స్ చేశాడు. ఈ ప్రాజెక్ట్‌లు ఇంకా స్టార్ట్ కాక ముందే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

నోటెడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ మధ్యే పవన్‌ను కలిసి స్టోరీ వినిపించగా.. స్క్రిప్ట్ నచ్చిన పవర్ స్టార్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు సమాచారం. పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని జానీకి సూచించినట్టు తెలుస్తోంది. మరి జానీ మాస్టర్ ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా మారుతారా? లేక కేవలం స్టోరీ మాత్రమే అందిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.



Next Story