- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్తపార్టీ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో.. జనసేన పార్టీ రంగంలోకి దిగింది. తెలంగాణలో పార్టీ విస్తరణకు జనసేనాని కొత్త వ్యూహం రచిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జనసేన పార్టీ వీర మహిళలతో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల ఆశయాల కోసం జనసేన కృషి చేస్తోందని అన్నారు. తెలంగాణ సామాజిక విప్లవం కోసం జనసేన అలుపెరగని పోరాటం చేస్తోందని వెల్లడించారు. తెలంగాణపై […]</p>

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్తపార్టీ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో.. జనసేన పార్టీ రంగంలోకి దిగింది. తెలంగాణలో పార్టీ విస్తరణకు జనసేనాని కొత్త వ్యూహం రచిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జనసేన పార్టీ వీర మహిళలతో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల ఆశయాల కోసం జనసేన కృషి చేస్తోందని అన్నారు. తెలంగాణ సామాజిక విప్లవం కోసం జనసేన అలుపెరగని పోరాటం చేస్తోందని వెల్లడించారు. తెలంగాణపై గౌరవంతోనే ఇంతకాలం పార్టీని విస్తరించలేదని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో పార్టీ విస్తరణకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. జనసేన పార్టీ పురుడు పోసుకుంది తెలంగాణ గడ్డపైనే అని గుర్తుచేసుకున్నారు. జనసేన తొలి ఎంపీటీసీ తెలంగాణలోనే గెలుచుకున్నామని అన్నారు. తెలంగాణలో తన బలం ఏంటో తనకు తెలుసని, జనసేన కన్నా తనపైనే తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఎక్కువ అని వెల్లడించారు. అంతేగాకుండా తనకు జన్మనిచ్చింది ఆంధ్రా అయితే.. పునర్జన్మనిచ్చింది మాత్రం తెలంగాణ అని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో భావసారూప్యం ఉన్న వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నా అని అన్నారు.






