సీఎం జగన్‌కి పవన్ కల్యాణ్ లేఖ

by Vemula.Srinu Prasad |

<p>సరైన రక్షణ సామగ్రి లేకుండా కరోనా రోగులకు వైద్యసిబ్బంది సేవలెలా? అందిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాన్ ప్రశ్నించారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితిపై సీఎంకు లేఖ రాస్తూ ప్రశ్నలు సంధించారు. కరోనా వ్యాధిగ్రస్తులకు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వైద్య సిబ్బంది వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని [&hellip;]</p>

సీఎం జగన్‌కి పవన్ కల్యాణ్ లేఖ
X

సరైన రక్షణ సామగ్రి లేకుండా కరోనా రోగులకు వైద్యసిబ్బంది సేవలెలా? అందిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాన్ ప్రశ్నించారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితిపై సీఎంకు లేఖ రాస్తూ ప్రశ్నలు సంధించారు. కరోనా వ్యాధిగ్రస్తులకు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వైద్య సిబ్బంది వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసి కూడా సేవలు అందిస్తున్నారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని ఎవరూ విస్మరించకూడదు. ఇంట్లో తమ బిడ్డలను వదిలొచ్చి వారు విధులను నిర్వర్తిస్తున్నారు. తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు ఆ చిన్నారులకు, ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే వారికి ప్రమాదం అని తెలిసి కూడా వారు సేవలందిస్తున్నారు. అలాంటి వైద్య సిబ్బందికి పూర్తి స్థాయిలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ అందుబాటులో ఉంచకపోవడం దారుణం అన్నారు.

ఆయుధాలను ఇవ్వకుండా సైనికులను యుద్ధానికి పంపడం న్యాయమా? అలాగే వైద్య సిబ్బందికి అవసరమైన ఎక్విప్ మెంట్ ఇవ్వకుండా కరోనాతో యుద్ధం చేయించాలనుకోవడం ధర్మం కాదన్నారు. కరోనాకు వైద్యం, పరీక్షలు చేసే సిబ్బంది ఎలాంటి గౌన్స్, గ్లోవ్స్, మాస్కులు, ఫేస్ షీల్డ్ ధరించాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది. దానికి తగ్గట్టుగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ ఇవ్వాలి. ఆసుపత్రుల్లో వాటిని సమకూర్చకపోవడంతో వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారుని ఆయన చెప్పారు.

ఎన్-95 మాస్కులు కూడా ఇవ్వడం లేదని, సాధారణ డిస్పోజబుల్ గౌన్స్ మాత్రమే ఇస్తున్నారని వైద్యులు చెబుతున్నారని, వారి మాటలాలకించాలని ఆయన సూచించారు. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం చేస్తున్న వారి సేవలను గుర్తించి, వారి ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వాలని ఆయన అన్నారు.

tags : pawan kalyan, power star on fire, pspk on corona, letter, ysrcp, ap cm, jagan,

Next Story