- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాట తీసి మోకాళ్లపై కూర్చోబెడతాం.. జాగ్రత్త: పవన్ హెచ్చరిక
by Vadlamudi Anukaran |
<p>దిశ, ఏపీ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఢంకా భజాయించబోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పవన్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో జనసేన గెలుస్తుందని ఈ విషయంపై తేల్చుకునేందుకు వైసీపీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తాట తీసి మోకాళ్లపై కూర్చోబెడతామని పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఏ వైసీపీ నాయకుడు ఇబ్బంది పెడుతున్నాడో అవన్నీ గుర్తుపెట్టుకోవాలని దానికి బదులివ్వాలని […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఢంకా భజాయించబోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పవన్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో జనసేన గెలుస్తుందని ఈ విషయంపై తేల్చుకునేందుకు వైసీపీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తాట తీసి మోకాళ్లపై కూర్చోబెడతామని పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఏ వైసీపీ నాయకుడు ఇబ్బంది పెడుతున్నాడో అవన్నీ గుర్తుపెట్టుకోవాలని దానికి బదులివ్వాలని పవన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వశాఖలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయని ఇది రాసిపెట్టుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు వైసీపీకి కౌరవ సభ చూపించామని రాబోయే రోజుల్లో పాండవ సభ ఏంటో చూపిస్తామని ఘాటుగా హెచ్చరించారు.
- Tags
- ap minister
Next Story






