- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ ఇంకా కోలుకోలేదా..? అసలు సమస్య అదేనా..?
<p>దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యాక పవన్ ని వెంటనే రామ్ చరణ్ తన ఫామ్‌హౌస్‌కి తరలించి చికిత్స అందించారు. ఇక పవన్ కి ఈ మధ్యనే నెగెటివ్ వచ్చినా కూడా ఆయన బయట ఎక్కడా కనిపించలేదు. దీంతో పవన్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఆరోగ్యంపై ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఇంకా పవన్ కోలుకోలేదా..? […]</p>

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యాక పవన్ ని వెంటనే రామ్ చరణ్ తన ఫామ్‌హౌస్‌కి తరలించి చికిత్స అందించారు. ఇక పవన్ కి ఈ మధ్యనే నెగెటివ్ వచ్చినా కూడా ఆయన బయట ఎక్కడా కనిపించలేదు. దీంతో పవన్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఆరోగ్యంపై ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఇంకా పవన్ కోలుకోలేదా..? ఆయన ఏ సమస్యతో బాధపడుతున్నారో అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని సమాచారం. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉండడంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, ఆయన విశ్రాంతి ఎక్కువ తీసుకోవాలని వైద్యులు తెలిపినట్లు సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. ఇకపోతే పవన్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’, ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో రెండు సినిమాల షూటింగ్‌లు తాత్కాలికంగా వాయిదా పడినట్టు సమాచారం.






