జనసైనికులు అప్రమత్తం చేయండి

by  |
జనసైనికులు అప్రమత్తం చేయండి
X

దిశ, వెబ్‌డెస్క్: నివర్ తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి విపత్తుతో రైతాంగం దెబ్బతినడం బాధాకరం అన్నారు. నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో రైతులు తీవ్రనష్టం జరిగిందని అన్నారు. వ్యవసాయ శాఖ తగిన విధంగా స్పందించాలని డిమాండ్ చేశారు. పంటలు కోల్పోయిన రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందచేస్తే వ్యవసాయం చేసేవారికి ధీమా కలుగుతుందన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మరో తుఫాన్ పొంచి ఉందని, ప్రజలను ముందుగా అప్రమత్తం చేసే చర్యల్లో జనసైనికులు భాగస్వాములు కావాలని పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed