మోదీ బర్త్ డే‌కు పవన్ కళ్యాణ్ 7 స్పెషల్ ట్వీట్స్

by  |
Pavan kalyan
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. వివిధ పార్టీల నాయకులు, సినీ ప్రముఖుల, పారిశ్రామికవేత్తలు ప్రధానికి బర్త్ డే విషెస్ చెప్పారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోదీని ఉద్దేశించి చేసిన ట్వీట్లు ప్రస్తుతం చర్చనీయమయ్యాయి. ఆయన చేసిన ఏడు ట్వీట్లలో ప్రధాని మోదీపై బీజేపీ నాయకులను మైమరిపింపజేస్తున్నాయంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

ఆయన చేసిన ట్వీట్లలో ‘‘శ్రీ మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!!, మన భారత దేశానికి ధృడ చిత్తం కలిగిన నాయకుడు అవసరమని నేను నిత్యం పరితపించేవాడిని. ఆ నాయకుడు మన విశాల భారత సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన రాజనీతిజ్ఞుడై ఉండాలని కోరుకునేవాణ్ణి.’’ అని ఒక ట్వీట్ ఉండగా.. ‘‘ ముఖ్యంగా భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన ఒక బిలియన్ ప్రజల భూమిని పాలించడం అంటే.. కత్తి మీద సాము వంటిదే. ఆ స్థానంలో ఉండటం ఎంతటివారికైనా సవాళ్లతో కూడుకున్నదే. అటువంటి స్థానంలో నిలిచిన శ్రీ నరేంద్ర మోదీ గారు.. గొప్ప దార్శనికునిగా నేను భావిస్తాను.’’ అని మరో ట్వీట్ ఉంది.

‘‘2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా శ్రీ మోదీ గారితో కలసి అనేక సభలలో ప్రచారంలో చేసే అవకాశం నాకు లభించింది. ఆయనలోని ఆకర్షణ శక్తిని సునిశితంగా గమనించడానికి ఆ ప్రయాణం నాకు దోహదపడింది.’’ అని చేసిన ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది. జనసేన పార్టీ బీజేపీతో పొత్తు ఉందని తెలుసు కానీ, బీజేపీ కార్యకర్త కంటే కూడా పవన్ కళ్యాణ్ మోదీని ఎక్కువ పొగుడుతున్నారంటూ ట్విట్టర్లో సెటైర్లు వేస్తున్నారు.


Next Story

Most Viewed