జానపద గాయకుడు పెంచల్ దాస్‌‌కు పవన్ సన్మానం

by Jakkula Samataha |

<p>దిశ, సినిమా : కడప జిల్లా, చిట్వేలి మండలం దేవమాచుపల్లికి చెందిన పెంచల్ దాస్ జానపద పాటలు పాడటంలో, రచించడంలో దిట్ట. రాయలసీమ యాసలో స్వచ్ఛమైన పల్లె పదాలను తన పాటల్లో పొందుపరిచి ఆ ప్రాంతానికి వన్నె తెస్తున్నాడు పెంచల్ దాస్. తనలోని విభిన్నమైన గాయకుడు, రచయితను మొట్టమొదట గుర్తించిన దర్శకుడు మేర్లపాక గాంధీ. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలోని ‘దారి చూడు దుమ్ము చూడు’ పాటతో మొదలైన దాస్ ప్రయాణం.. ‘భలేగుంది బాలా’ వరకు అప్రతిహతంగా సాగుతోంది. [&hellip;]</p>

pawan facilitated singer penchal das
X

దిశ, సినిమా : కడప జిల్లా, చిట్వేలి మండలం దేవమాచుపల్లికి చెందిన పెంచల్ దాస్ జానపద పాటలు పాడటంలో, రచించడంలో దిట్ట. రాయలసీమ యాసలో స్వచ్ఛమైన పల్లె పదాలను తన పాటల్లో పొందుపరిచి ఆ ప్రాంతానికి వన్నె తెస్తున్నాడు పెంచల్ దాస్. తనలోని విభిన్నమైన గాయకుడు, రచయితను మొట్టమొదట గుర్తించిన దర్శకుడు మేర్లపాక గాంధీ. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలోని ‘దారి చూడు దుమ్ము చూడు’ పాటతో మొదలైన దాస్ ప్రయాణం.. ‘భలేగుంది బాలా’ వరకు అప్రతిహతంగా సాగుతోంది. ఈ క్రమంలోనే పెంచల్ దాస్‌ పాటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కాగా రాయలసీమ ప్రాంత జానపదాలను, అక్కడి మాండలికాన్నీ నేటి తరానికి చేరువ చేస్తున్న విధానాన్ని ప్రశంసిస్తూ పవన్ కళ్యాణ్ తాజాగా పెంచల్‌ దాస్‌ను సత్కరించడం విశేషం.

పెంచల్ దాస్‌తో పాటు కర్నూలు జిల్లా, బంటుపల్లి గ్రామానికి చెందిన గో సంరక్షకుడు చాంద్ బాషాను కూడా పవన్ సన్మానించారు. కాగా బాషా దాదాపు 400 ఆవులతో గోశాలను నిర్వహిస్తున్నారు. ఇక క్రిష్-పవన్ మూవీకి పనిచేసిన ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్రకు చెందిన 16 మంది మల్లయోధులను పవన్ ఘనంగా సన్మానించిన విషయం తెలిసిందే.

Next Story