- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పరుగు’ పరుగున పెళ్లి పీటల మీదికి..
<p>దిశ, వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పరుగు మూవీ హీరోయిన్ షీలా నాలుగైదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామకు లక్ ఏ మాత్రం కలిసి రాలేదు. అందుకే కెరియర్ మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. దాదాపు 24 సినిమాలు చేసినా కాలం కలిసి రాకా అంతగా గుర్తింపు పొందలేదు. కొత్త హీరోయిన్లు రావడంతో సినిమాలకు దూరమైపోయిన షీలా ఇప్పుడు పెళ్లి పీటలెక్కింది. ప్రముఖ వ్యాపారవేత్త […]</p>

దిశ, వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పరుగు మూవీ హీరోయిన్ షీలా నాలుగైదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామకు లక్ ఏ మాత్రం కలిసి రాలేదు. అందుకే కెరియర్ మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. దాదాపు 24 సినిమాలు చేసినా కాలం కలిసి రాకా అంతగా గుర్తింపు పొందలేదు. కొత్త హీరోయిన్లు రావడంతో సినిమాలకు దూరమైపోయిన షీలా ఇప్పుడు పెళ్లి పీటలెక్కింది. ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డి అనే వ్యక్తితో చైన్నైలో ఘనంగా వివాహం చేసుకుంది షీలా. రెండు కుటుంబాలు, దగ్గరి మిత్రుల సమక్షంలో జరిగిన పెళ్లికి సినీ ఇండస్ట్రీకి చెందిన వారు హాజరుకాలేదని తెలుస్తోంది. పరుగులో బన్నీతో జోడి కట్టిన షీలా… మస్కాలో రామ్ సరసన మెరిసింది. అదుర్స్‌లో యంగ్ టైర్ ఎన్టీఆర్ హీరోయిన్‌గా కనిపించినా.. సరైన హిట్ పడకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరమైంది.
Tags: Parugu Heroine, Sheela Kaur, Parugu, Marriage






