జ్ఞాపకంలో.. మరిచిపోలేని ఉద్యమ నాయకుడు

by  |
జ్ఞాపకంలో..  మరిచిపోలేని ఉద్యమ నాయకుడు
X

దిశ, గుండాల: గోదావరి లోయ ప్రతి ఘటన ఉద్యమం నాయకుడు ఆదివాసీల ఆత్మ బంధువు లింగన్న మరణించి నేటీకి మూడు సంవత్సరాలు. దీంతో ఆయన జ్ఞాపకాలను పార్టీ నాయకులు గుర్తు చేసుకున్నారు. ఇల్లందు విప్లవోద్యమంలోనే ఆయన పేరు తెలియని వారు అంటూ ఉండరు. గుండాల మండలం రోళ్ళగడ గ్రామంలో జన్మించిన లింగన్న బాల్యం నుండి విప్లవ భావాలు కలిగి 1990 నుంచి విద్యార్థి యువజన ఉద్యమాల్లో పనిచేశారు. 1997లో అజ్ఞాతంలోకి వెళ్లి, అంచెలంచెలుగా మండల కార్యదర్శిగా, కొత్తగూడం డివిజన్ కమిటీ సభ్యుడిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతూ2019 ఆగస్టు 31వ తేదీన రోడ్ల గడ్డ సమీపంలోని పంది గుట్ట వద్ద జరిగిన ఎన్ కౌంటర్‌లో అమరుడయ్యాడు. అప్పట్లో లింగన్న ఎన్ కౌంటర్ రాష్ట్రంలోనే చర్చనీయంగా మారింది.

సుదీర్ఘకాలం విప్లవ ఉద్యమంలో పనిచేసిన లింగన్న ఇల్లందు ఏజెన్సీ ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశాడు. ప్రజల తలలో నాలికలా మేలిగి, అందరితోనూ చనువుగా ఉంటూ ఈ ప్రాంత విప్లవోద్యమంలో ప్రత్యేకతను చాటాడు. శత్రువు కూడా మెచ్చే విధంగా లింగన్న నడవడిక ఉండేది. గుండాల అల్లపల్లి మండలాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజలు, ఈ ప్రాంతంలో పనిచేస్తున్న అధికారులు, లింగన్న కుచనువుగా ఉండి వాళ్ళ సమస్యలు విన్నవించుకుని పంచాయితీలు చేయించుకునేవారు. ఏ సమస్య వచ్చినా ఈ ప్రాంత ప్రజలకు లింగన్న కొండంత అండ. విప్లవోద్యమంలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి, ఉద్యమాన్ని నిర్మించిన ఏకైక వ్యక్తి లింగం అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఆయన మరణించడంతో ఈ ప్రాంత విప్లవోద్యమంలో కొంత సమస్య ఏర్పడ్డా.. లింగన్న లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని, పార్టీ శ్రేణులు ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వాపోతున్నారు. కాగా లింగన్న మూడో వర్ధంతి సభను గ్రామ గ్రామాల్లో నిర్వహించాలని న్యూ డెమోక్రసీ నాయకులు పిలుపునిచ్చారు


Next Story

Most Viewed