పార్టీ విజయం కోసం కృషి చేయాలి

by Shyam |

<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు పార్టీ నాయకులంతా కృషి చేయాలని గోషామహల్ నియోజకవర్గం ఎన్నికల అబ్జర్వర్, ఎమ్మెల్సీ బోడెకంటి వెంకటేశ్వర్లు సూచించారు. ఈ మేరకు బుధవారం ఇసామియా బజార్ మేఘరాజ్ భవన్‎లో జరిగిన పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమంలో వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గోషామహల్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రేమ్ సింగ్ రాథోడ్, సీనియర్ నాయకులు నందకిషోర్ వ్యాస్, గన్ ఫౌండ్రీ కార్పొరేటర్ మమతా [&hellip;]</p>

పార్టీ విజయం కోసం కృషి చేయాలి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు పార్టీ నాయకులంతా కృషి చేయాలని గోషామహల్ నియోజకవర్గం ఎన్నికల అబ్జర్వర్, ఎమ్మెల్సీ బోడెకంటి వెంకటేశ్వర్లు సూచించారు. ఈ మేరకు బుధవారం ఇసామియా బజార్ మేఘరాజ్ భవన్‎లో జరిగిన పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమంలో వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గోషామహల్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రేమ్ సింగ్ రాథోడ్, సీనియర్ నాయకులు నందకిషోర్ వ్యాస్, గన్ ఫౌండ్రీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా, గోవింద్ రాటి, మహిళా నాయకురాలు శీలం సరస్వతి ఆర్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ అధిష్టానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నందున పార్టీ నాయకులంతా ఐకమత్యంతో పనిచేసి అభ్యర్థి విజయానికి పాటుపడాలని కోరారు. ఫారం 18లో నూతన పట్టభద్ర ఓటర్లను నమోదు చేయించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

Next Story