- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీజులపై పేరెంట్స్ గరం గరం.. రంగంలోకి విద్యాశాఖ!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సమయంలో విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు బోధించిన విద్యాసంస్థలు ప్రస్తుతం అన్ని తెరుచుకుంటున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవల 6 నుంచి 9 తరగతుల ప్రారంభానికి కూడా విద్యాశాఖ అనుమతినిచ్చింది. అయితే, పాఠశాలల్లో ఏడాది ఫీజులు వసూలు చేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్లాసులు ప్రారంభమై కనీసం రెండు నెలలు కూడా గడువక ముందే మొత్తం ఫీజులు చెల్లించాలని స్కూల్ యాజమాన్యాలు డిమాండ్ చేయడంపై మండిపడుతున్నారు. పలువురు పేరెంట్స్ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సమయంలో విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు బోధించిన విద్యాసంస్థలు ప్రస్తుతం అన్ని తెరుచుకుంటున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవల 6 నుంచి 9 తరగతుల ప్రారంభానికి కూడా విద్యాశాఖ అనుమతినిచ్చింది. అయితే, పాఠశాలల్లో ఏడాది ఫీజులు వసూలు చేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్లాసులు ప్రారంభమై కనీసం రెండు నెలలు కూడా గడువక ముందే మొత్తం ఫీజులు చెల్లించాలని స్కూల్ యాజమాన్యాలు డిమాండ్ చేయడంపై మండిపడుతున్నారు.
పలువురు పేరెంట్స్ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విద్యాశాఖ రంగంలోకి దిగింది. స్కూల్ ఫీజుల నియంత్రణకు కసరత్తు ప్రారంభించింది. ఈ విషయమై శనివారం అధికారులు సమావేశం కానున్నారు. మార్చి1వ తేదీన పాఠశాల విద్యాశాఖ మరోసారి భేటీకానుంది. తిరుపతి రావు నివేదికను విద్యాశాఖ అధికారులు అధ్యయనం చేయనున్నారు.
Next Story






