- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైమ్‌లో పారాసైట్.. హిందీ ఆడియోతో!
<p>దిశ, వెబ్‌డెస్క్: డిసెంబర్ నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు ఈ సినిమా గురించి మాట్లాడుకోని వ్యక్తి అంటూ లేరు. అవార్డు సీజన్ మొత్తంలో ఎవరి నోట విన్నా ఈ సినిమా గురించే వినిపించేది. అదేదో హాలీవుడ్ సినిమా కాదు, బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్ ఉన్న చిత్రం కూడా కాదు. ఆ సినిమా పేరు పారాసైట్. దక్షిణ కొరియా సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చిన సినిమా ఇది. ఆస్కార్ ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రమిది. దీంతో […]</p>

దిశ, వెబ్‌డెస్క్:
డిసెంబర్ నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు ఈ సినిమా గురించి మాట్లాడుకోని వ్యక్తి అంటూ లేరు. అవార్డు సీజన్ మొత్తంలో ఎవరి నోట విన్నా ఈ సినిమా గురించే వినిపించేది. అదేదో హాలీవుడ్ సినిమా కాదు, బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్ ఉన్న చిత్రం కూడా కాదు. ఆ సినిమా పేరు పారాసైట్. దక్షిణ కొరియా సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చిన సినిమా ఇది. ఆస్కార్ ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రమిది.
దీంతో అప్పట్లో ఈ సినిమాలో ఏముందో చూద్దామని జనాలు ఎగబడి డౌన్‌లోడ్ చేసుకున్నారు. కొరియన్ అర్థం కాకపోయిన ఇంగ్లిషు సబ్‌టైటిల్స్ పెట్టుకుని ఒక కన్ను పైన, మరో కన్ను కింద పెట్టుకుని ఇబ్బంది పడుతూ చూశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రత్యేకంగా డౌన్లోడ్ అవసరం లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా చూడొచ్చు. అది కూడా హిందీ డబ్బింగ్ ఆడియోతో. క్వారంటైన్ టైమ్‌లో ప్రైమ్ వీడియో ఈ సినిమాను విడుదల చేసి మంచిపని చేసిందని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags: Parasite, Oscar, amazon prime, Hindi Audio






