మానవత్వం చాటిన ఎమ్మెల్యే చల్లా.. అభినందించిన స్థానికులు

by  |
Parakala MLA Challa Dharma Reddy
X

దిశ, ఆత్మకూర్: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మానవత్వం చాటుకున్నారు. గురువారం హన్మకొండ జిల్లాలోని ఆత్మకూరు మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ సందర్భంలో పక్కనే మూర్చ వచ్చి ఓ వ్యక్తి కిందపడిపోయాడు. గమనించిన ఎమ్మెల్యే ఆ వ్యక్తికి నీళ్లు తాగించి, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చల్లా ధర్మారెడ్డి మానత్వాన్ని చూసిన స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుమలత రజినీకార్, జెడ్పీటీసీ రాధిక రాజు, వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు సంజీవరెడ్డి, ఆత్మకూర్ ఎంపీటీసీ రామరాజు, గుడెపాడ్ మార్కెట్ చైర్మన్ కేశవరెడ్డి, సోసైటీ డైరెక్టర్ సుధాకర్, కో-ఆప్షన్ సభ్యులు ఎండీ అంకుస్, గ్రామ పార్టీ అధ్యక్షుడు రవీందర్, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed