ఎంసెట్‌లో 92.57శాతం ఉత్తీర్ణత..

by  |
ఎంసెట్‌లో 92.57శాతం ఉత్తీర్ణత..
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఎంసెట్ (మెడికల్, అగ్రికల్చర్) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ పాపిరెడ్డి JNTUలో ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష రాసిన వారిలో 92.57% మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. అగ్రికల్చర్​, మెడిసిన్​ విభాగంలో ఎంసెట్​ రాసేందుకు 78,981 మంది రిజిస్ట్రేషన్​ చేసుకోగా.. 63,857 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 59,113 మంది అర్హత సాధించారు. పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ 28, 29 తేదీల్లో రెండు సెషన్లలో నిర్వహించారు. ఫలితాలను చూసుకునేందుకు, ర్యాంక్​ కార్డులను డౌన్​‌లోడ్​ చేసుకునేందుకు విద్యార్థులు tseamcet.tsche.ac.in వెబ్‌సైట్‌ నుంచి తీసుకోవాలని ఎంసెట్​ కన్వీనర్​ సూచించారు. ఇక సైన్స్​ విభాగం తొలి మూడుస్థానాల్లో అమ్మాయిలు, తర్వాత టాప్​ 7 ర్యాంకులు అబ్బాయిలు సొంతం చేసుకున్నారు.

టాప్​-10 ర్యాంకర్లు వీరే..

1. గుత్తి చైతన్య సింధు
2. మారెడ్డి సాయి త్రిషా రెడ్డి
3. తుమ్మల స్నికిత
4. దర్శి విష్ణు సాయి
5. మల్లిడి రిషిత్
6. శ్రీమల్లిక్ చిగురుపాటి
7. ఆవుల‌ సుభాన్
8. గారపాటి గుణ చైతన్య
9. గిండేటి వినయ్ కుమార్
10. కోట వెంకట్​

ఇంజనీరింగ్​ 71.49శాతం సీట్లు భర్తీ..

ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో ఇప్పటి వరకూ 71.49% సీట్లు భర్తీ అయ్యాయి. అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 12 నుంచి20 వరకూ సర్టిఫికెట్లు వెరిఫికేషన్​ చేశారు. ఇంజనీరింగ్​లో 55,785 మంది సర్టిఫికెట్​ వెరిఫికేషన్​కు హాజరయ్యారు. వీరిలో 54,981 విద్యార్థులు వెబ్​ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. ఈ విభాగంలో 74,094 సీట్లు ఉండగా..50,288 మందికి సీట్లు కేటాయించారు. ఇంజనీరింగ్​లో 178 కాలేజీల్లో 70,135 సీట్లు ఉండగా.. 50,137 (71.49%) సీట్లు ఇప్పటివరకూ కేటాయించారు. ఇక ఫార్మసీ విభాగంలో 119 కాలేజీల్లోని 4,505 సీట్లలో 181 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 4,324 సీట్లు ఖాళీగా ఉన్నట్టు జేఎన్టీయూ పేర్కొంది.



Next Story