- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రవీంద్రభారతిలో పాపన్నగౌడ్ జయంతి వేడుకలు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 371వ జయంతిని పురస్కరించుకొని గురువారం రవీంద్రభారతిలో నిర్వహించే జయంతి వేడులకు గౌడకులస్తులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని జైగౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు వట్టికూటి రామారావు గౌడ్ కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జైగౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ అధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ హాజరవుతున్నందున తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, గౌడ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 371వ జయంతిని పురస్కరించుకొని గురువారం రవీంద్రభారతిలో నిర్వహించే జయంతి వేడులకు గౌడకులస్తులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని జైగౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు వట్టికూటి రామారావు గౌడ్ కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జైగౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ అధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ హాజరవుతున్నందున తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, గౌడ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు, కులస్తులంతా తరలివచ్చి పాపన్న జయంతిని విజయవంతం చేయాలని కోరారు. మంత్రుల చేతుల మీదుగా తాటిచెట్టుపై పడి మృతి చెందిన, శాశ్వతంగా వికలాంగులైన వారి కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
Next Story






