కలకు మించిన జీవితాన్ని అనుభవిస్తున్నా : పంకజ్ త్రిపాఠి

by  |
Pankaj Tripathi
X

దిశ, సినిమా: బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి కెరియర్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నాడు. సినిమా సినిమాకు యాక్టింగ్‌లో వేరియేషన్ చూపిస్తూ ఆడియన్స్‌ను మరింత ఇంప్రెస్ చేస్తున్న ఆయన.. ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ సిరీస్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. 2004లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన పంకజ్.. ప్రస్తుతం తన కల నిజమైందని చెప్పాడు. తాను కేవలం సినిమా చేస్తే చాలనుకున్నానని.. కానీ అంతకు మించిన పేరు ప్రఖ్యాతలు రావడం గొప్ప విషయమన్నాడు. నిజానికి తన డ్రీమ్ చాలా చిన్నదని.. దేవుడు అంతకుమించిన జీవితాన్ని ప్రసాదించాడని తెలిపాడు. ఈ మధ్యే ‘మిమి’ సినిమాలో కీ రోల్ ప్లే చేసి సక్సెస్ అందుకున్న ఆయన.. ‘83’ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు.



Next Story

Most Viewed