సైకిల్‌ను ఢీకొట్టి.. పంచాయతీ కార్యదర్శి మృతి

175
kottakondaa

దిశ, మానకొండూరు : ముందు వెళ్తున్న సైకిల్‌ను ఢీకొట్టి పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ ఈనాడు ఆఫీసు వద్ద శుక్రవారం వెలుగుచూసింది. మృతుని బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. కొత్తకొండ శ్రీనివాస్ (36) కరీంనగర్‌లో స్థిరపడ్డాడు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌ నుంచి కొత్తకొండ శ్రీనివాస్ కరీంనగర్ వైపు బైక్‌పై వెళ్తున్న క్రమంలో ముందు సైకిల్ పై వెళ్తున్న మొగిలిపాలెం గ్రామానికి చెందిన నారాయణపురం పోచయ్య అనే వ్యక్తిని వెనుక నుండి వేగంగా ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ నడుపుతున్న కొత్తకొండ శ్రీనివాస్ తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందగా.. పోచయ్యకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతన్ని వెంటనే ఎల్ఎండీ పోలీసులు అంబులెన్సులో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..