- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టర్ సీరియస్.. పంచాయతీ సెక్రటరీ సస్పెండ్, సర్పంచ్‌లకు షోకాజ్ నోటీసులు
<p>దిశ, కామారెడ్డి : జిల్లా కలెక్టర్ శరత్ కుమార్.. రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లో ఈరోజు పర్యటించారు. పల్లెప్రగతి, పారిశుధ్య పనుల్ని పరిశీలించారు. రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నాటిన మొక్కల సంరక్షణతో పాటు పారిశుధ్య నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు పంచాయతీ కార్యదర్శిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని, ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. డివిజనల్ పంచాయతీ అధికారితో విచారణ చేపట్టి నివేదిక […]</p>

దిశ, కామారెడ్డి : జిల్లా కలెక్టర్ శరత్ కుమార్.. రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లో ఈరోజు పర్యటించారు. పల్లెప్రగతి, పారిశుధ్య పనుల్ని పరిశీలించారు. రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నాటిన మొక్కల సంరక్షణతో పాటు పారిశుధ్య నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు పంచాయతీ కార్యదర్శిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని, ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.
డివిజనల్ పంచాయతీ అధికారితో విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని సూచించారు. సదాశివనగర్ మండలం భూంపల్లి గుట్టపై అవెన్యూ ప్లాంటేషన్‌లో నిర్లక్ష్యం వహించినందుకు ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్‌లకు ఛార్జిమెమో జారీ చేయాలని, పంచాయతీ సెక్రటరీకి చార్జీ మెమో జారీ చేయడంతో పాటు ఒకరోజు ఇంక్రిమెంట్ నిలిపివేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.






