- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నాం..
<p>దిశ, సూర్యపేట: జిల్లా కేంద్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గత కొద్ది నెలలుగా ఉపాధి హామీ పనుల భారాన్ని పూర్తిగా పంచాయతీ కార్యదర్శుల మీద మోపడంతో తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నామన్నారు. ఉపాధి హామీ పనులను పూర్తిగా మినహాయింపు చేయాలన్నారు. అంతేకాకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తూ, పే స్కేలు అమలు చేయాలని వారు కోరారు. జగిత్యాల జిల్లాలో విధుల నుంచి తొలగించిన జూనియర్ పంచాయతీ […]</p>

X
దిశ, సూర్యపేట: జిల్లా కేంద్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గత కొద్ది నెలలుగా ఉపాధి హామీ పనుల భారాన్ని పూర్తిగా పంచాయతీ కార్యదర్శుల మీద మోపడంతో తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నామన్నారు. ఉపాధి హామీ పనులను పూర్తిగా మినహాయింపు చేయాలన్నారు. అంతేకాకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తూ, పే స్కేలు అమలు చేయాలని వారు కోరారు. జగిత్యాల జిల్లాలో విధుల నుంచి తొలగించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story






