- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొద్దిరోజుల్లో పెళ్లి.. ఇంతలోనే కరోనాకు యువకుడు బలి
by Batti.Sumithra |
<p>దిశ, షాద్ నగర్ : అంతా సక్రమంగా జరిగితే ఈనెలలోనే పెళ్లి కావలసింది. కానీ, విధి ఆ యువకుడిని కరోనా రూపంలో కాటేసి ఆ కుటుంబంలో విషాదం నింపింది. వివరాలలోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండల పరిధిలోని రామేశ్వరం, రంగంపల్లి గ్రామాలకు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న కె. మణికంఠ యాదవ్(29) కరోనాతో మృతి చెందాడు. కరోనా బారినపడిన మణికంఠకు.. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత కొన్నిరోజులుగా […]</p>

X
దిశ, షాద్ నగర్ : అంతా సక్రమంగా జరిగితే ఈనెలలోనే పెళ్లి కావలసింది. కానీ, విధి ఆ యువకుడిని కరోనా రూపంలో కాటేసి ఆ కుటుంబంలో విషాదం నింపింది. వివరాలలోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండల పరిధిలోని రామేశ్వరం, రంగంపల్లి గ్రామాలకు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న కె. మణికంఠ యాదవ్(29) కరోనాతో మృతి చెందాడు.
కరోనా బారినపడిన మణికంఠకు.. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత కొన్నిరోజులుగా చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ గురువారం మణికంఠ మృతి చెందాడు. మృతుడు మణికంఠది ఫరూఖ్ నగర్ మండలంలోని లింగారెడ్డిగూడ గ్రామం. అయితే..మణికంఠకు పెళ్లి కుదరడంతో ఈనెలలోనే వివాహం జరగాల్సి ఉండగా అంతలోనే ఇలా జరిగడంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story






