ఈ రాశి వారు అత్తింటి తరఫున చెడు వార్త వింటారు..

176

తేది : 16 సెప్టెంబర్ 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : దశమి
(నిన్న ఉదయం 11 గం॥ 20 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 9 గం॥ 37 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాషాఢ
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 57 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 9 ని॥ వరకు)
యోగము : శోభనము
కరణం : గరజ
వర్జ్యం : (ఉదయం 12 గం॥ 41 ని॥ నుంచి మధ్యాహ్నం 2 గం॥ 13 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : ( రాత్రి 9 గం॥ 57 ని॥ నుంచి 11 గం॥ 29 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఉదయం 10 గం॥ 8 ని॥ నుంచి 10 గం॥ 56 ని॥ వరకు)( సాయంత్రం 3 గం॥ 2 ని॥ నుంచి 3 గం॥ 50 ని॥ వరకు)
రాహుకాలం : ( మధ్యాహ్నం 1 గం॥ 42 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 13 ని॥ వరకు)
యమగండం : ( ఉదయం 12 గం॥ 10 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 41 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 4 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 18 ని॥ లకు
సూర్యరాశి : సింహము
చంద్రరాశి : ధనుస్సు

మేషరాశి : పట్టుదల మరియు సరైన ప్రణాళికతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కష్టే ఫలి. కష్టపడితేనే ఫలితం లభిస్తుంది. టెన్షన్ పడకండి. ఆఫీసులో అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ. సరైన ప్రణాళికతో ఆఫీసు పనులను పూర్తిచేయండి. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ అమ్మగారితో సహనంతో ప్రవర్తించండి. ఆదాయ వ్యవహారాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. స్థిరాస్తి అమ్మకాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి లాభాలు. అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. సహనంతో తెలివితేటలతో ప్రవర్తించే మీ తీరుపట్ల అందరి ప్రశంసలు. ఇంటిలో పెద్ద వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు తగిన సమయం కేటాయించడం లేదని బాధ పడే బదులు వారితో సఖ్యంగా ఉండండి ఆనందించండి.

మిధున రాశి : స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సఫలం. మీ భావాలను నిర్భయంగా చెప్పండి. చెప్పలేక మధన పడటం వలన అనారోగ్యం. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. ఆఫీసు పనులలో మీ సామర్థ్యంపై ప్రశంసలు. కొంతమందికి ప్రమోషన్ అవకాశం. అదృష్టం మీ వైపు ఉంది ధన లాభం. పొదుపు చేస్తారు. కొంతమందికి తల్లిగారి వైపునుంచి ధనలాభం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది

వృషభ రాశి : ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విద్యార్థులకు వారి శ్రమకు తగిన ఫలితం. షేర్ మార్కెట్ ద్వారా అధిక లాభాలు. మరింత సంపాదన కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. ఆఫీసులో పనులను సకాలంలో త్వరత్వరగా పూర్తిచేస్తారు. భార్యతో సంయమనంగా మాట్లాడండి మీ బంధం మరింత ధృఢ మవుతుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చాలని ఆలోచనను వదిలివేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు ఆనందించండి

కర్కాటక రాశి : ఇంటిలో శుభకార్యం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. గందరగోళం వదిలేయండి సహనంతో ఆలోచించండి. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. వ్యాపారస్తులు పన్ను చెల్లింపు వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. ఆదాయం పరవాలేదు. పాతబాకీలు వసూలవుతాయి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. సరైన ప్రణాళికతో పనులు పూర్తి చేయండి. అధిక శ్రమ వల్ల వెన్ను నొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోండి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి

సింహరాశి : సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. ముఖ్యమైన నిర్ణయాలలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి పాజిటివ్ ఆలోచనలు కొరకు మెడిటేషన్ చేయండి. ఆఫీసు పని మీద శ్రద్ధ పెడతారు. పెండింగ్ పనుల తో సహా అన్ని పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ విషయాలు మరియు ఖర్చుల గురించి చర్చిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీ రోజువారీ కార్యక్రమాలలో సహాయం చేయటం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఆనందించండి.

కన్య రాశి : ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల కొరకు కొంత సమయం కేటాయించండి వారు మీ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక చెడు వార్త వినడం వలన మీ మానసిక ప్రశాంతత ఈ రోజు మొత్తం దూరమవుతుంది వివాహం కాని వారికి సంబంధం కుదిరే అవకాశం. ఆఫీసు పనులలో అదనపు బాధ్యతల వల్ల అధిక శ్రమ. పట్టుదలతో పనులను పూర్తిచేయండి. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులపై ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు మీ బంధాలనూ తెగే వరకు లాగవద్దు.

తులారాశి : మానసిక ప్రశాంతత కొరకు మెడిటేషన్ చేయండి. పిరికితనం, నెగెటివ్ థాట్స్ వదిలివేయండి. ఆధ్యాత్మిక మార్గం మీద ఆసక్తి కనబరుస్తారు. ‘‘కొంతమంది అత్తగారి తరపు వైపు నుంచి చెడు వార్త వినవచ్చు’’. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను తెస్తాయి. ఆఫీసు పనులు సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. నిర్లక్ష్యం వహించకండి. ఊహించని ఖర్చులు వలన ఆర్థిక పరంగా ఇబ్బంది. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోండి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

వృశ్చిక రాశి : ఆశావహ దృక్పథం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ భార్యతో పరుషంగా మాట్లాడకండి. ఆఫీసులో పనులను అదనపు బాధ్యతలను మోపినా సకాలంలో చకచకా పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆదాయం పరవాలేదు అనుకోని ఖర్చులు ఉన్నాయి. ఒత్తిడి వలన తలనొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

ధనుస్సు రాశి : అద్దె ఇంటి నుండి సొంత ఇంటికి మారాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. దాన ధర్మాల వలన దైవ బలం. కుటుంబ విషయాల పరంగా భార్యాభర్తల మధ్య గొడవలు సంయమనం వహించండి. మూడో వ్యక్తిని మీ మధ్యలోకి రానీయకండి. కుటుంబంలో పెద్ద వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కావాల్సినంత ధనం చేతికందుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. తీసుకున్న అప్పులు తీర్చి వేయండి లేకుంటే వారు కేసు పెడతారు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మకర రాశి : నిరాశను పక్కకు పెట్టకపోతే అది మిమ్మల్ని ఎదగనీయదు. ఊహించని విధంగా పాతబాకీలు వసూలవుతాయి. అనుకోని ఖర్చుల వలన ఆర్థిక ఇబ్బంది మానసిక అశాంతి. కొంతమంది ఉద్యోగస్తులకు జీతాలు రాక ఇబ్బంది. పరుల గురించి చెడుగా మాట్లాడకండి. వ్యాపారస్తులకు వ్యాపారం సాధారణంగా ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోండి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.

కుంభరాశి : ఆత్మవిశ్వాసము, సరైన ప్రణాళికతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మీ వ్యక్తిత్వం పట్ల సంఘంలో పేరుప్రతిష్టలు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్థాలు తొలగి ఆనందం కలుగుతుంది. దైవ ప్రార్ధన వలన వలన పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ముఖ్యమైన విషయాలలో నిర్ణయం మీరే తీసుకోండి. ఆఫీసు పనిలో అధిక శ్రమ. పనులు పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక, సహనం తప్పనిసరి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు ఒకరికొకరు సహాయ సహకారాలు అందజేసుకోండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు అయినా జాగ్రత్తలు తీసుకోండి. కావలసినంత ధనం చేతికందుతుంది.

మీనరాశి : పట్టుదల సరైన ప్రణాళికతో అనుకున్న కార్యాలు సాధిస్తారు. ఎంతో కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యం చక్కబడుతుంది. కోపావేశాలను వదిలివేయండి. దాని వలన చాలా సమస్యల నుండి బయటపడతారు. మీ మొండి వైఖరి ఇంటిలోని వారిని ఇబ్బంది పెడుతుంది. ఆఫీసులో తోటి ఉద్యోగులతో అధికారులతో వాదోప వాదాలకు దిగకండి. అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ. అనవసరపు దుబారా ఖర్చులు నివారించండి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్య వలన మానసిక అశాంతి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోండి మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు గడపండి.