సరిలేరుమీకెవ్వరు ‘పల్లె’ బ్రదర్స్

by Shyam |

<p>దిశ, రంగారెడ్డి: ‘‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’’ అన్న మన పెద్దల నానుడిని నిజం చేస్తూ ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహాయం చేస్తూ సామాజిక సేవ‌తో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ పల్లె బ్రదర్స్. వివరాల్లోకెళ్తే..రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లె ఆనంద్ కుమార్, పల్లె బాలీశ్వర్‌లు అన్నదమ్ములు. పల్లె ఆనంద్ కుమార్ మండల పరిధిలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరికీ సుపరిచితుడే. [&hellip;]</p>

సరిలేరుమీకెవ్వరు ‘పల్లె’ బ్రదర్స్
X

దిశ, రంగారెడ్డి: ‘‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’’ అన్న మన పెద్దల నానుడిని నిజం చేస్తూ ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహాయం చేస్తూ సామాజిక సేవ‌తో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ పల్లె బ్రదర్స్. వివరాల్లోకెళ్తే..రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లె ఆనంద్ కుమార్, పల్లె బాలీశ్వర్‌లు అన్నదమ్ములు. పల్లె ఆనంద్ కుమార్ మండల పరిధిలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరికీ సుపరిచితుడే. తన అన్న అడుగుజాడల్లో నడుస్తూ అన్న చేసే సేవా కార్యక్రమాల్లో తనవంతు సహాయ సహకారాలు అందజేస్తున్నాడు తమ్ముడు పల్లె బాలీశ్వర్.

తల్లి దండ్రులైన పల్లె పద్మమ్మ, వెంకటయ్య‌ల జ్ఞాపకార్థం తమ్ముడు బాలీశ్వర్‌తో కలిసి పల్లె ఆనంద్ కుమార్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ -19) మహమ్మారి కట్టడికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. ప్రజలెవరు ఇల్లు వదిలి బయటికి రావద్దని అధికార యంత్రాంగం హెచ్చరిస్తున్నది. దీంతో పనులకు వెళ్లలేక పల్లెల్లో కూలినాలి పని చేసుకునే వారి ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారింది. వారిని ఆదుకునేందుకు పల్లె బ్రదర్స్ ముందుకొచ్చారు.

ఆకలితో అలమటిస్తున్న దాదాపు ఐదొందల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఖర్చు చేసి 14 నిత్యావసర సరుకులతో కూడిన ప్యాకేజీని ఇంటింటికీ తిరిగి గ్రామస్తులకు అందజేశారు. ప్రస్తుత తరుణంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి తమ వంతు సహాయంగా నిత్యం దైనందిన అవసరాలకు అవసరమైన వస్తువులు అందజేసి గ్రామస్తులను ఆదుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టం విలువ తెలిసిన వ్యక్తులు‌గా తాము పుట్టిన కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజల అభివృద్ధి‌లోనే తమ ఆనందాన్ని వెతుక్కుంటున్నారు ఈ బ్రదర్స్. ‘పల్లె’ అభివృద్ధే తమ అభివృద్ధని అంటున్నారీ సోదరులు.

సెంటు భూమి లేక బతుకుతెరువు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామానికి చెందిన 29 మంది దళిత నిరుపేదలకు ఏడాది పొడవునా ఉపాధి కలిగేలా గ్రామ సమీపంలో మూడు ఎకరాల వ్యవసాయ పొలాన్ని కొనుగోలు చేశారు. అందులో 3 బోర్లు వేయించి పొలం అంతా నీరు పారే విధంగా డ్రిప్ ఏర్పాటు చేసి, గడ్డిని పెంచి షెడ్లు వేయించి పల్లె బ్రదర్స్ తమ సొంత పూచీకత్తుపై బ్యాంకు లోను ద్వారా 29 మందికి ఆవులను ఇప్పించి పంపిణీ చేశారు. ప్రస్తుతం వారు పాల ద్వారా ఉపాధి పొందుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రామానికి చెందిన ఇల్లు లేని నిరుపేద దళితుడైన బైండ్ల లింగానికి సొంత పైసలతో అన్నదమ్ములు ఇల్లు కట్టిస్తున్నారు. దీంతో లింగం కుటుంబంలో ఆనందానికి అవధులు లేవు. రైలు ప్రమాదంలో కుడి కాలు పోగొట్టుకున్న చింతకుంట పల్లి గ్రామానికి చెందిన పోగు శ్రావణి‌కి జైపూర్ నుంచి కృత్రిమ కాలు తెప్పించి పల్లె ఆనంద్ కుమార్ అందజేశారు.

గ్రామంలో ముస్లిం సోదరుల ప్రార్థనలకు ఈద్గా, పీర్ల చావిడి, హిందువులకు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం, ఆలయ ముఖ ద్వారం సొంత ఖర్చుతో నిర్మించారు. గ్రామస్తులకు స్వచ్ఛ నీటిని అందించేందుకు వాటర్ ప్లాంటు ఏర్పాటు చేశారు. గ్రామంలో తాగునీటి ఎద్దడి ఉండటంతో సొంతంగా ట్యాంకర్లు ఏర్పాటుచేసి ట్యాంకర్ల సహాయంతో గ్రామస్తులకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తున్నారు. ఏటా మండల కేంద్రంలో వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు తమ తల్లిదండ్రుల పేరుమీద చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్తపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి వారి దాహార్తిని తీర్చేందుకు పల్లె ఆనంద్ కుమార్ సొంతంగా బోరు వేయించాడు. ఈ విధంగా చెబుతూ వెళితే పల్లె బ్రదర్స్ చేసిన సహాయానికి అంతే ఉండదు. ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ “సరిలేరు మీకెవ్వరు” అని ప్రజలతో అనిపించుకుంటున్నారు ఈ పల్లె బ్రదర్స్.

ఆపత్కాలంలో సాయం చేసామనే తృప్తి..

కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఈ ఆపత్కాలంలో గ్రామస్తులకు సాయం చేసామనే తృప్తి కలిగింది. గ్రామ దివంగత సర్పంచ్ పల్లె పద్మమ్మ మా అమ్మ. అమ్మ చెప్పిన విధంగా నిరంతరం ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నాను. మా అమ్మ, నాన్న మరణించిన తర్వాత వారి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలను చేపడుతున్నాను. సేవలోనే నా తల్లిదండ్రులను చూసుకుంటున్నాను. ప్రతి సేవా కార్యక్రమంలో మా తమ్ముడి సహకారం ఉండటం అదృష్టం.

– పల్లె ఆనంద్ కుమార్, కొండారెడ్డి పల్లి గ్రామం

గ్రామస్తుల అభివృద్ధి‌లొనే ఆనందం..

గ్రామస్తుల అభివృద్ధికి నా చేతనైన సహాయం చేస్తున్నాను. సేవా కార్యక్రమాలలో అన్న పల్లె ఆనంద్ కుమార్‌కు చేదోడువాదోడుగా ఉంటాను. గ్రామస్తుల అభివృద్ధిలో తాను భాగస్వామిని అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం కరోనా నేపథ్యం‌లో ఇబ్బందుల కాలంలో గ్రామస్తులకు తమవంతు సాయంచేయడం అదృష్టం‌గా భావిస్తున్నాను.

– పల్లె బాలీశ్వర్, కొండారెడ్డి పల్లి గ్రామం

Tags: ideal brothers, palle anand, baleshwar, helping village people, kondareddypally

Next Story