- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగో రౌండ్‌లోనూ ‘పల్లా’ జోరు..
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి దూసుకెళ్తున్నారు. మొదటి మూడు రౌండ్లలోనూ పల్లా ఆధిక్యం కనబర్చగా, నాలుగో రౌండులోనూ ఆధిక్యం దిశగా సాగిపోతున్నారు. నాలుగో రౌండులో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 15,897 ఓట్లు రాగా, తీన్మార్ మల్లన్నకు 12,146, ప్రొఫెసర్ కోదండరాం 10,048, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 5,099, కాంగ్రెస్ అభ్యర్థి రాములునాయక్ 4,003 ఓట్లు వచ్చాయి. దీంతో నాలుగో రౌండ్ […]</p>

X
దిశ ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి దూసుకెళ్తున్నారు. మొదటి మూడు రౌండ్లలోనూ పల్లా ఆధిక్యం కనబర్చగా, నాలుగో రౌండులోనూ ఆధిక్యం దిశగా సాగిపోతున్నారు.
నాలుగో రౌండులో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 15,897 ఓట్లు రాగా, తీన్మార్ మల్లన్నకు 12,146, ప్రొఫెసర్ కోదండరాం 10,048, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 5,099, కాంగ్రెస్ అభ్యర్థి రాములునాయక్ 4,003 ఓట్లు వచ్చాయి. దీంతో నాలుగో రౌండ్ ముగిసే సరికి పల్లా రాజేశ్వర్ రెడ్డి 63,443 ఓట్లు, తీన్మార్ మల్లన్న 48,001, కోదండరామ్ 39,554 ఓట్లతో ఉన్నారు. నాలుగో రౌండ్ తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి 15,438 ఓట్ల మెజార్టీతో ముందుకు సాగుతున్నారు.
Next Story






