2023లో టీఆర్ఎస్‌దే అధికారం: ఎమ్మెల్సీ పల్లా

by  |
2023లో టీఆర్ఎస్‌దే అధికారం: ఎమ్మెల్సీ పల్లా
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కుల, మతరాజకీయాలకు చోటు లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. 2023లో టీఆర్ఎస్ దే అధికారమని వెల్లడించారు. తెలంగాణ శాసన మండలిలోని చైర్మన్ ఛాంబర్ లో మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి గురువారం పల్లాతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణ తరహాలో ఎక్కడా అభివృద్ధి ,సంక్షేమ ఫలాలు ప్రజలకు అందడం లేదన్నారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య ప్రభుత్వ సమర్ధ విధానాల వల్ల గణనీయంగా తగ్గిందని, సింగరేణిలో బాలికపై అత్యాచారం ,హత్య బాధాకరం అన్నారు.

దుర్మార్గుడి మృతిపై చర్చ అనవసరం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి , మహమూద్ అలీ , తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత,వాణి దేవి, దామోదర్ రెడ్డి, పురాణం సతీశ్ ,తెర చిన్నపరెడ్డి, శేరి శుభాష్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్ రావు,గంగధర్ గౌడ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య,భాస్కర్ రావు,భగత్ కుమార్ ,తెలంగాణ లెజిస్లీచర్ సెక్రెటరీ డాక్టర్ నరసింహ చార్యులు, మాజీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పాతురి సుధాకర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed