ఈటల, ఆర్ఎస్ఎస్‌పై పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

by Vadlamudi Anukaran |

<p>దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఈటల రాజేందర్.. శనివారం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈటల కామెంట్లను దుయ్యబట్టారు. వామపక్ష వాదినని, బహుజనవాదినని, ప్రజాస్వామ్యవాదినని చెప్పుకున్న ఈటల.. నేడు బీజేపీలో చేరడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి భావజాలం ఉన్నవారు ఎప్పుడు కూడా బీజేపీలో చేరలేదని, ఒక్క ఈటల మాత్రమే తన ఆస్తులను కాపాడుకునేందుకు అందులో జాయిన్ [&hellip;]</p>

MLC Palla Rajeshwar Reddy
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఈటల రాజేందర్.. శనివారం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈటల కామెంట్లను దుయ్యబట్టారు. వామపక్ష వాదినని, బహుజనవాదినని, ప్రజాస్వామ్యవాదినని చెప్పుకున్న ఈటల.. నేడు బీజేపీలో చేరడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి భావజాలం ఉన్నవారు ఎప్పుడు కూడా బీజేపీలో చేరలేదని, ఒక్క ఈటల మాత్రమే తన ఆస్తులను కాపాడుకునేందుకు అందులో జాయిన్ అయ్యారని ఆరోపించారు.

నీ పోరాటం, ఆరాటం అంతా కూడా ఆస్తులపై ప్రేమతోనే తప్ప ఆత్మగౌరవం, డీఎన్ఏలో లేదని అన్నారు. రాజేందర్ డీఎన్ఏ ఏంటో పరీక్షలు చేయించుకుని చెప్తే తెలుస్తుంది తప్ప తమకెలా తెలుస్తుందని పల్లా ప్రశ్నించారు. కులాలను, మతాలను విడదీసి పాలిస్తున్న బీజేపీ డీఎన్ఏ కచ్చితంగా ఛాతుర్ వర్ణ సిద్ధాంతానికి అనుగుణంగా మాత్రమే ఉంటుందని పల్లా ఆరోపించారు. ఆర్ఎస్‌యూ.. సమసమాజం అంతా కలిసి ఉండాలని చెప్తుంటే.. ఆర్ఎస్ఎస్ మాత్రం సమాజాన్ని విడదీస్తుందని మండిపడ్డారు.

సమాజాన్ని విడదీసే ఆర్ఎస్ఎస్, సమాజాన్ని కలిపి ఉంచే ఆర్ఎస్‌యూ.. ఒకటే అని ఈటల అనడం ఆయన భావ దారిద్య్రానికి నిదర్శనం తప్ప మరొకటి కాదని పల్లా రాజేశ్వర్ విమర్శించారు. ఈటల వెనుక ఇప్పుడు వామపక్ష వాదులు కానీ, ప్రజాస్వామ్య వాదులు కానీ ఎవ్వరూ లేరని.. కేవలం ఆస్తులను కాపాడుకునే బ్యాచ్ మాత్రమే మిగిలిందని ఆరోపించారు.

Next Story