పాకిస్తాన్ కెప్టెన్‌పై లైంగిక ఆరోపణలు

by Vadlamudi Anukaran |   (  Updated:2020-11-29 06:22:12  IST  )

<p>దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళ ఆరోపించింది. తనను మాససికంగా, లైంగికంగా వేధింపులకు గురి చేశాడని శనివారం మీడియాకు తెలిపింది. గత 10 ఏళ్లుగా బాబర్ వేధింపులు తనపై కొనసాగుతూనే ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. &#8216;బాబర్ తనతో కలసి చదువుకునే రోజుల నుంచి పరిచయం ఉందని.. పదేళ్ల క్రితమే అతడు తనను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. దీంతో అతడిని నమ్మి తాను ఇంటి [&hellip;]</p>

పాకిస్తాన్ కెప్టెన్‌పై లైంగిక ఆరోపణలు
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళ ఆరోపించింది. తనను మాససికంగా, లైంగికంగా వేధింపులకు గురి చేశాడని శనివారం మీడియాకు తెలిపింది. గత 10 ఏళ్లుగా బాబర్ వేధింపులు తనపై కొనసాగుతూనే ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘బాబర్ తనతో కలసి చదువుకునే రోజుల నుంచి పరిచయం ఉందని.. పదేళ్ల క్రితమే అతడు తనను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. దీంతో అతడిని నమ్మి తాను ఇంటి నుంచి పారిపోయి వచ్చేశాను. అతడి క్రికెట్ కెరీర్ కోసం తాను ఎంతో ఆర్థిక సాయం చేశాను.

నా సహాయంతో అతడు జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎదిగాడు. ఆ తర్వాత తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. తనను దూరం పెట్టాడు. తనను గర్భవతిగా చేయడమే కాకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. ఇప్పటికీ అతడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు’ అని ఆమె మీడియా ఎదుట తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇటీవల బాబర్ సదరు మహిళను చంపేస్తానని బెదిరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. కాగా, బాబర్ ప్రస్తుతం న్యూజీలాండ్ పర్యటనలో ఉన్నాడు. అతడు నోరు విప్పితే కాని అసలు విషయాలు బయటకు తెలియవు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా స్పందించలేదు.

Next Story