- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమీర్ ఖాన్ హత్యకేసు నిందితుడట… పాక్ చానల్
<p>బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ను ఓ హత్య కేసులో నిందితున్ని చేసింది పాకిస్థాన్ లోని ఓ టీవీ చానల్. ఆలోచించకుండా అత్యుత్సాహానికి పోయి విమర్శలపాలు అవుతోంది. సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?… పాకిస్థాన్ కు చెందిన MQM నాయకుడు అమీర్ ఖాన్ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. 17 ఏళ్లుగా ఈ కేసు కోర్టుల చుట్టూ తిరుగుతుండగా… ఈ మధ్య అమీర్ ఖాన్ కు ఈ హత్యతో […]</p>

బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ను ఓ హత్య కేసులో నిందితున్ని చేసింది పాకిస్థాన్ లోని ఓ టీవీ చానల్. ఆలోచించకుండా అత్యుత్సాహానికి పోయి విమర్శలపాలు అవుతోంది. సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?… పాకిస్థాన్ కు చెందిన MQM నాయకుడు అమీర్ ఖాన్ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. 17 ఏళ్లుగా ఈ కేసు కోర్టుల చుట్టూ తిరుగుతుండగా… ఈ మధ్య అమీర్ ఖాన్ కు ఈ హత్యతో సంబంధం లేదని కోర్టు స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో అందరికన్నా ముందు బ్రేకింగ్ వేయాలనుకున్న ఆ టీవీ చానల్ .. అతి తొందర్లో భారీ తప్పు చేసింది. నాయకుడు అమీర్ ఖాన్ ఫోటోకు బదులుగా… భారతీయ నటుడు అమీర్ ఖాన్ ఫోటోను వేసింది. అయితే సదరు టీవీ చానల్ తప్పును గ్రహించి సర్దుకునే లోపే… జరగాల్సింది అంతా జరిగిపోయింది. పాకిస్థాన్ లో అమీర్ ఖాన్ కు ఫ్యాన్స్ ఎక్కువే కావడంతో చానల్ పై భారీగా కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చడ్డా” సినిమా చేస్తున్నారు. క్రిస్టమస్ 2020 కి విడుదల కావాల్సిన ఈ సినిమా… కరోనా ప్రభావంతో షూటింగ్ ఆగిపోవడంతో 2021 లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.
Tags: Amir Khan, Bollywood, Pakistan, TV Channel






