మేం ఏం పాపం చేశాం.. నిరాహార‌ దీక్ష‌కు దిగిన నేతన్నలు

by Sridhar Babu |   (  Updated:2021-08-09 01:08:41  IST  )

<p>దిశ, కమలాపూర్ : పద్మశాలీలకు ఏం లేదా..  మేం ఏం పాపం చేశాం, మాకు పద్మశాలి బంధు కావాలని పద్మశాలీలు నిరాహార దీక్ష చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సోమవారం పద్మశాలి అధ్యక్షుడు తుమ్మ శోభన్ ఆధ్వర్యంలో పద్మశాలి కులస్తులు  నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులకు దళిత బంధు పథకం మాదిరిగా పద్మశాలి బంధు పథకాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల [&hellip;]</p>

మేం ఏం పాపం చేశాం.. నిరాహార‌ దీక్ష‌కు దిగిన నేతన్నలు
X

దిశ, కమలాపూర్ : పద్మశాలీలకు ఏం లేదా.. మేం ఏం పాపం చేశాం, మాకు పద్మశాలి బంధు కావాలని పద్మశాలీలు నిరాహార దీక్ష చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సోమవారం పద్మశాలి అధ్యక్షుడు తుమ్మ శోభన్ ఆధ్వర్యంలో పద్మశాలి కులస్తులు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులకు దళిత బంధు పథకం మాదిరిగా పద్మశాలి బంధు పథకాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల కోసం దళిత బంధు ప్రవేశ పెడుతున్నప్పుడు పద్మశాలిల కోసం పద్మశాలి బంధు ప్రవేశపెట్టాలని వారు కోరారు. పద్మశాలీలకు చాలా అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story