- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్ నుండి పడాల శ్రీనివాస్ సస్పెండ్.. నలుగురుపై కేసు…
<p>దిశ, యాదగిరిగుట్ట: నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డిపై దాడికి యత్నించిన పడాల శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గొంగడి సునీత వెల్లడించారు. యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ.. శనివారం జరిగిన తుర్కపల్లి మండల అధ్యక్ష ఎన్నిక ఉదయం నుండి రాత్రి వరకు తీవ్ర ఉత్కంఠ నడుమ సాగింది. అయితే ఈ ఎన్నికలో అధ్యక్ష పదవికి పడాల శ్రీనివాస్‌ను కాదని […]</p>

దిశ, యాదగిరిగుట్ట: నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డిపై దాడికి యత్నించిన పడాల శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గొంగడి సునీత వెల్లడించారు. యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ.. శనివారం జరిగిన తుర్కపల్లి మండల అధ్యక్ష ఎన్నిక ఉదయం నుండి రాత్రి వరకు తీవ్ర ఉత్కంఠ నడుమ సాగింది. అయితే ఈ ఎన్నికలో అధ్యక్ష పదవికి పడాల శ్రీనివాస్‌ను కాదని నరేందర్ రెడ్డిని ఎన్నుకున్నారు.
దీంతో ఈ ఎన్నికను జీర్ణించుకోలేకపోయిన పడాల శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి గొంగడి మహేందర్ రెడ్డిపై దాడి యత్నించి టీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించారనే ఆరోపణలతో 6 సంవత్సరాల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు సునీత తెలిపారు. తుర్కపల్లి మండల కేంద్రంలో నిన్న రాత్రి దాడి చేసిన వ్యక్తులపై డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పడాల శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురుపై 5 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు తుర్కపల్లి ఎస్సై తెలిపారు.






