- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మమ్మల్ని తీసేయకండి.. సిద్దిపేటలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన
<p>దిశ, సిద్దిపేట: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి రోగులకు సేవలు చేసిన తమను ఇప్పటికిప్పుడు ఉద్యోగాల నుంచి తొలగించడం సబబు కాదని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. కార్మికులకు మద్దతుగా బీజేపీ నాయకులు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. రాత్రికి రాత్రే తమకు ఫోన్ చేసి నేటి నుంచి డ్యూటీలకు రావద్దని తెలిపారని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు కూడా చెల్లించలేదని వాపోయారు. […]</p>

X
దిశ, సిద్దిపేట: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి రోగులకు సేవలు చేసిన తమను ఇప్పటికిప్పుడు ఉద్యోగాల నుంచి తొలగించడం సబబు కాదని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. కార్మికులకు మద్దతుగా బీజేపీ నాయకులు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. రాత్రికి రాత్రే తమకు ఫోన్ చేసి నేటి నుంచి డ్యూటీలకు రావద్దని తెలిపారని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు కూడా చెల్లించలేదని వాపోయారు. తమను ఉద్యోగాల నుంచి తొలగించకుండా, తిరిగి నియమించుకోవాలని డిమాండ్ చేశారు. కొవిడ్ సమయంలో తమ ప్రాణాలకు రక్షణ లేకుండా, కుటుంబాలని వదిలి సేవ చేశామని గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి హరీష్ రావు చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరారు.
Next Story






