అవుట్ సైడర్స్ నాట్ అలౌడ్

by B.Srinivas |   (  Updated:2020-04-12 01:55:46  IST  )

<p>దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ తెచ్చిపెట్టిన లాక్‌డౌన్ ప్రజలను నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తోంది. అదే మోతాదులో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి వీధిలో స్థానిక నివాసితులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించిన ప్రభుత్వం, ఆ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు పూనుకుంది. అంతే కాకుండా.. బయట నుంచి ఈ వీధిలోకి, ఈ వీధి నుంచి బయటకు వెళ్ళకుండా [&hellip;]</p>

అవుట్ సైడర్స్ నాట్ అలౌడ్
X

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ తెచ్చిపెట్టిన లాక్‌డౌన్ ప్రజలను నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తోంది. అదే మోతాదులో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి వీధిలో స్థానిక నివాసితులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించిన ప్రభుత్వం, ఆ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు పూనుకుంది. అంతే కాకుండా.. బయట నుంచి ఈ వీధిలోకి, ఈ వీధి నుంచి బయటకు వెళ్ళకుండా పోలీసులు బారికేడ్లతో మూసి వేశారు. ఇదే నేపథ్యంలో హైదరాబాద్ విద్యానగర్ ఎస్సార్ట్ క్వార్టర్స్‌లోని ఓ వీధిలో స్థానిక కాలనీ వాసులు ఆ రోడ్డును తమకు తామే కంటెన్మెంట్ క్లస్టర్‌గా ప్రకటించుకున్నారు. ఆ వీధికి రెండు వైపులా కట్టెలతో బారికేడ్లను ఏర్పాటు చేసి మూసివేశారు. అంతే కాదు, అవుట్ సైడర్స్ నాట్ అలౌడ్ అంటూ బోర్డులు రాసి మరీ ఉంచారు. కరోనా ప్రభావానికి ప్రజలెంతగా భయబ్రాంతులకు గురవుతున్నారో ఇదే ఉదాహరణ అంటూ పలువురు మాట్లాడుకుంటున్నారు.

Tags: Corona Effect, Lockdown, Vidyanagar Essarity Colony, Outsiders Not Allowed

Next Story