- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరెంట్ స్తంభంపై నుంచి పడి లైన్‌మన్ మృతి
విధులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి, స్తంభం పై నుంచి కింద పడి ఓ విద్యుత్ శాఖ ఉద్యోగి మరణించిన విషాద సంఘటన గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, కార్వాన్ : విధులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి, స్తంభం పై నుంచి కింద పడి ఓ విద్యుత్ శాఖ ఉద్యోగి మరణించిన విషాద సంఘటన గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ (35) బేగం బజార్ సబ్‌స్టేషన్ పరిధిలోని చూడి బజార్ సెక్షన్‌లో ఆర్టిసాన్ గ్రేడ్-4 ఫీల్డ్ వర్కర్‌గా పనిచేస్తున్నారు. అయితే గురువారం మధ్యాహ్నం జైన్ మందిర్ సమీపంలోని ఓ ఇంట్లో కరెంట్ సమస్యను సరి చేయడానికి ఆయన తన సహోద్యోగి షేక్ రఫీతో కలిసి నాగర్‌ఖానాలోని విద్యుత్ స్తంభం వద్దకు వెళ్లారు. ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్‌లు తీసివేసి, లైన్ క్లియర్ చేసుకున్న తర్వాతే ఇమ్రాన్ స్తంభం ఎక్కి మరమ్మతులు ప్రారంభించారు. అయితే, పనులు జరుగుతుండగానే అదే స్తంభానికి ఉన్న వీధి దీపాల ఫేజ్ వైర్‌లోకి అనుకోకుండా విద్యుత్ సరఫరా అయింది. దీంతో ఇమ్రాన్‌కు తీవ్రంగా విద్యుత్ షాక్ తగిలింది. సహోద్యోగి రఫీ వెంటనే అప్రమత్తమై మెయిన్ కనెక్షన్ కట్ చేసినప్పటికీ, విద్యుత్ షాక్ ప్రభావంతో ఇమ్రాన్ బ్యాలెన్స్ కోల్పోయి పైనుంచి కింద పడిపోయారు. కింద ఉన్న ప్రజలు ఆపడానికి ప్రయత్నించినప్పటికీ, తలకు తీవ్ర గాయం కావడంతో ఆయన స్పృహ కోల్పోయారు. స్థానికులు వెంటనే ఆయనను ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.






